
రాజకీయాలు

ప్రపంచ తొలి ట్రిలియనీర్గా నిలిచిన ఎలాన్ మస్క్ మరోసారి తన నిరాడంబర జీవనశైలితో వార్తల్లో నిలిచారు. స్పేస్ఎక్స్ విజయాలతో అపార సంపదను సొంతం చేసుకున్నప్పటికీ, ఆయన టెక్సాస్లోని బోకా చికా ప్రాంతంలో స్టార్బేస్ సమీపంలోని సుమారు 400 చదరపు అడుగుల ప్రీఫ్యాబ్ ఇంట్లో నివసిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఇంట్లో బెడ్రూమ్, కిచెన్, లివింగ్ స్పేస్, బాత్రూమ్ వంటి కనీస సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి.
ఆస్తులు, విలాసవంతమైన జీవితం కంటే పని, ఆవిష్కరణలకే ప్రాధాన్యం ఇస్తానని గతంలో మస్క్ పలుమార్లు పేర్కొన్నారు. తనకు చెందిన అనేక ఇళ్లను విక్రయించిన ఆయన, సరళమైన జీవనశైలినే ఎంచుకున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఉన్నప్పటికీ, సాధారణ జీవితం గడపడం ద్వారా మస్క్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!