

హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామా రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ను కలిసి వినతిపత్రం అందజేశారు. సీఈఓ తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ గత కొన్ని రోజులుగా సాంకేతిక సమస్యలతో పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియ తీవ్రంగా ప్రభావితమవుతోందని తెలిపారు. నవంబర్ 6, 2026 ఓటరు నమోదు చివరి తేదీగా నిర్ణయించిన నేపథ్యంలో వెబ్‌సైట్ అందుబాటులో లేకపోవడం వల్ల వేలాది మంది అర్హులైన గ్రాడ్యుయేట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
వెబ్‌సైట్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించి, ఆన్‌లైన్ ఓటరు నమోదు సేవలను పునరుద్ధరించాలని సామా రామ్మోహన్ రెడ్డి కోరారు. అంతేకాకుండా వెబ్‌సైట్ పనిచేయని రోజుల సంఖ్యకు సమానంగా ఓటరు నమోదు గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కోల్పోకుండా ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!