

‘ది ప్యారడైజ్’ తర్వాత నేచురల్ స్టార్ నాని తన తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’పై దృష్టి సారించారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రస్తుతం న్యూఢిల్లీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే తాజా షెడ్యూల్‌లో భాగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని వీడియోలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు సమాచారం. ఢిల్లీలోని రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతుండటంతో, స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో సన్నివేశాలను రికార్డ్ చేయకుండా నియంత్రించడం చిత్ర బృందానికి సవాలుగా మారింది. లీకైన వీడియోల్లో నాని కొత్త లుక్‌తో పాటు షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వివరాలు కనిపిస్తున్నాయి.
కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలో ఈ వీడియోలు బయటకు రావడం చిత్ర బృందానికి ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాబోయే షెడ్యూళ్లలో లొకేషన్ భద్రతను పెంచడంతో పాటు సినిమా వివరాలు బయటకు రాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాణ సంస్థ త్వరలో అధికారికంగా వెల్లడించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!