2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం

Writer: Pooja 02:50 PM, 2 నవంబర్, 2026
సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ సంస్థ బైనాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన భారీ సైబర్ దాడి నేపథ్యంలో కస్టమర్లు పెద్ద సంఖ్యలో తమ నిధులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. దీంతో సుమారు 3.6 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు బైనాన్స్ ప్లాట్‌ఫామ్ నుంచి బయటకు వెళ్లాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.35 వేల కోట్లకు పైమాటే. ఈ పరిణామంతో క్రిప్టో మార్కెట్‌లో ఆందోళన నెలకొంది.

బైనాన్స్‌పై జరిగిన సైబర్ దాడిలో సుమారు 6.3 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు చోరీకి గురైనట్లు సమాచారం. ఈ దాడి వెనుక ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్లు ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సహా పలు సంస్థలు, బ్లాక్‌చెయిన్ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే బైనాన్స్ అప్రమత్తమై గురువారం కస్టమర్ల విత్‌డ్రాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దాడి జరిగిన తీరు, నిధుల నష్టం, భద్రతా వ్యవస్థలోని లోపాలపై దర్యాప్తు చేపట్టింది. ఆదివారం నుంచి దశలవారీగా విత్‌డ్రాలను పునఃప్రారంభించింది. అయితే సేవలు అందుబాటులోకి రాగానే పలువురు కస్టమర్లు తమ క్రిప్టో ఆస్తులను ఇతర వాలెట్లకు తరలించారు. దీంతో భారీగా నిధులు బయటకు వెళ్లాయి. తొలుత విత్‌డ్రాలు ఒక్కసారిగా పెరిగాయని, ఆ తర్వాత క్రమంగా తగ్గాయని బైనాన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఈ ఘటనలో కస్టమర్లకు ఎలాంటి ఆర్థిక నష్టం కలగకుండా చూస్తామని బైనాన్స్ హామీ ఇచ్చింది. చోరీకి గురైన క్రిప్టో ఆస్తుల విలువను కంపెనీ సొంత నిధులు, అత్యవసర నిల్వలు, బీమా నిధుల ద్వారా భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే చోరీకి గురైన ఆస్తుల విలువలో దాదాపు 95 శాతాన్ని భర్తీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఘటన వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తామే భరిస్తామని, కస్టమర్లపై ఎలాంటి అదనపు భారం మోపబోమని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం

విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ధన్‌తేరాస్‌ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా?

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ధన్‌తేరాస్‌ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా?

ట్యాగ్లు
బైనాన్స్క్రిప్టో కరెన్సీసైబర్ దాడిక్రిప్టో భద్రతపెట్టుబడిదారులుడిజిటల్ ఆస్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీని శకునితో పోల్చిన తేజస్వీ..జ్ఞానేశ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్‌
రాజకీయాలు

మోదీని శకునితో పోల్చిన తేజస్వీ..జ్ఞానేశ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్‌

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !
సినిమాలు

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించి ప్రాసిక్యూట్‌ చేయాలి - ఎంఏ బేబీ
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించి ప్రాసిక్యూట్‌ చేయాలి - ఎంఏ బేబీ

జమ్మూ కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే - ఫరూఖ్‌ అబ్దుల్లా
రాజకీయాలు

జమ్మూ కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే - ఫరూఖ్‌ అబ్దుల్లా

ఐపీఎల్ వేలానికి ముందు సీఎస్‌కేలో కీలక మార్పులు.
క్రీడలు

ఐపీఎల్ వేలానికి ముందు సీఎస్‌కేలో కీలక మార్పులు.

నాని - సుజీత్ 'బ్లడీ రోమియో' సెట్స్ నుంచి లీకులు: చిత్ర యూనిట్‌కు తలనొప్పి
గాసిప్స్

నాని - సుజీత్ 'బ్లడీ రోమియో' సెట్స్ నుంచి లీకులు: చిత్ర యూనిట్‌కు తలనొప్పి

సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం
బిజినెస్

సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం

'జైలర్ 2' ఓటీటీ వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్
సినిమాలు

'జైలర్ 2' ఓటీటీ వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్

విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం
బిజినెస్

విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్
జనరల్

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 2 విడుదల

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు
జనరల్

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!