
జనరల్

2013 ఆగస్టు 11న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘నవభారత యువభేరి’ సభను కేంద్ర మంత్రి, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్‌గా, ప్రధానమంత్రి అభ్యర్థిగా నియమితులైన నరేంద్ర మోదీ ఈ వేదికగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ సభ దేశ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ వేదికగా మోదీ ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం తర్వాత బీజేపీ వరుస విజయాలు సాధిస్తూ బలోపేతమైందని కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ‘వికసిత భారత్ సంకల్పం–2047’ లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టానికి 13 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ నాటి జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!