

కేరళ ఓనం బంపర్ లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. టీఎల్ 360615 నంబరు గల టికెట్‌కు మొదటి బహుమతిగా రూ.30 కోట్ల భారీ జాక్‌పాట్ దక్కింది. అయితే ఆ టికెట్ కొనుగోలు చేసిన విజేత ఎవరో ఇంకా తెలియరాలేదు. కన్నూర్‌లోని ముత్తు లాటరీ ఏజెన్సీ ఈ టికెట్‌ను విక్రయించింది. ఏజెన్సీ నిర్వాహకుడు అనీశ్ తాలిపరంబలో విజేతకు టికెట్ విక్రయించినట్లు తెలిపారు. గత క్రిస్మస్-నూతన సంవత్సర బంపర్ లాటరీలోనూ మొదటి బహుమతి తాలిపరంబలో విక్రయించిన టికెట్‌కే రావడం విశేషం. అనీశ్ గత 18 ఏళ్లుగా లాటరీ టికెట్ల వ్యాపారంలో కొనసాగుతున్నారు.
ఓనం బంపర్ లాటరీలో రెండో బహుమతిగా 20 మందికి ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున అందజేస్తారు. మొదటి బహుమతి విజేతకు కమిషన్, పన్నులు తదితర మినహాయింపుల అనంతరం రూ.16.47 కోట్లు బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. కేరళ లాటరీ చరిత్రలో తొలిసారిగా ఓనం బంపర్ టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. మొత్తం 90 లక్షల టికెట్లు ముద్రించగా, అన్నీ విక్రయమయ్యాయి. దీంతో సుమారు రూ.450 కోట్ల టర్నోవర్ నమోదైంది. టికెట్ల విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.241.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!