
జనరల్

జమ్మూ కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లా కంగన్ ప్రాంతంలోని హరిగన్‌వాన్ సమీపంలో అమర్‌నాథ్ యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి జారి సమీపంలోని ఓ ఇంటిని ఢీకొట్టింది. పదునైన మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బస్సు సింధ్ నదిలో పడకుండా ఆ ఇల్లు అడ్డుగా నిలవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.
ఈ ఘటనలో గాయపడిన 39 మంది యాత్రికులను స్థానికులు, భద్రతా సిబ్బంది వెంటనే రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి ఉత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!