
సినిమాలు

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం ఈ నెల 23 వరకు కొనసాగనుంది. సుమారు 30 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. భక్తులు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులను వినియోగించాలని, ప్రజా రవాణాతో ట్రాఫిక్ అంతరాయం తగ్గుతుందని సూచించారు.
భక్తుల కోసం ఐమ్యాక్స్, హెచ్‌ఎండీఏ స్థలం, ఎన్టీఆర్ పార్క్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు జోయల్ డెవిస్ తెలిపారు. వీఐపీల కోసం ప్రత్యేక మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భక్తులు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!