
సినిమాలు

హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు మరింత బాధ్యత, ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీలో జీహెచ్‌ఎంసీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర అభివృద్ధిపై హైదరాబాద్ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
మూడు కార్పొరేషన్లపై కూడా సమగ్రంగా చర్చ జరగాలని రాజాసింగ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువ ఉందా లేదా అనే అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!