

సిద్దిపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించాల్సిన జిల్లా సైన్స్ ఫేర్‌ను ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సైన్స్ ఫేర్‌ను ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే సామర్థ్యం కూడా ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సైన్స్ ఫేర్‌ల ద్వారా సిద్దిపేటకు జాతీయ స్థాయిలో అవార్డులు, గుర్తింపు లభించాయని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం సిద్దిపేటపై వివక్ష చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
సిద్దిపేటలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయకపోవడంపైనా హరీశ్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. అకాడమీ భవన నిర్మాణం సగం పూర్తయినా, ఇప్పటివరకు విద్యార్థులకు ఒక జత దుస్తులు మాత్రమే అందించారని పేర్కొన్నారు. జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ నిర్వహణలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే సిద్దిపేటలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న పాఠశాల దుస్తులను పంపిణీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!