

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), జిమ్కో (GMMCO Ltd) ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా టెక్సాస్, అరిజోనా రాష్ట్రాల్లోని ప్రముఖ మైనింగ్ యంత్రాల తయారీ కేంద్రాలను సందర్శించి, అంతర్జాతీయ ప్రమాణాల ఆధునిక సాంకేతికతను పరిశీలించింది. సింగరేణి గనుల్లో భద్రతను మరింత మెరుగుపరచడం, ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.
అరిజోనాలోని కేటర్పిల్లర్ డెమాన్‌స్ట్రేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్‌లో స్వయంచాలిత, రిమోట్ కంట్రోల్ మైనింగ్ యంత్రాల పనితీరును బృందం పరిశీలించింది. అనంతరం టెక్సాస్‌లోని కొమాట్సు మైనింగ్ కార్పొరేషన్ కేంద్రాన్ని సందర్శించి యంత్రాల తయారీ, నిర్వహణ, సాంకేతిక సహకారం, స్పేర్ పార్ట్స్ సరఫరా అంశాలపై చర్చలు జరిపింది. ఈ సాంకేతికత ద్వారా గనుల్లో కార్మికుల భద్రత పెరగడంతో పాటు ప్రమాదాలు, నిర్వహణ వ్యయాలు తగ్గే అవకాశముందని అధికారులు అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!