
జనరల్

రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది. 95 శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత వెలువడిన ప్రాథమిక ఫలితాల ప్రకారం.. ఆ పార్టీకి 57.83 శాతం ఓట్లు వచ్చాయి. 2021 ఎన్నికల్లో నమోదైన 49.8 శాతం ఓట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 8 శాతం పెరుగుదల నమోదైంది.
రష్యా దిగువ సభ అయిన స్టేట్ డుమాలోని మొత్తం 450 సీట్లలో యునైటెడ్ రష్యా పార్టీ 355 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఆ పార్టీ రాజ్యాంగ మెజారిటీని కొనసాగించనుంది. 2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాలో జరిగిన తొలి పార్లమెంటరీ ఎన్నికలు ఇవే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!