

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ రాజకీయాల్లో ఘన విజయాన్ని సాధించిన తర్వాత ఇప్పుడు మీడియా రంగంలోకి కూడా అడుగుపెట్టనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా చేరేలా సొంత మీడియా వేదిక అవసరమనే ఆలోచనతో టీవీకే ఒక వార్తా ఛానల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియా పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించగా, ప్రధాన స్రవంతి మీడియాలో తగిన ప్రాధాన్యం లభించలేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమైందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న ‘వెట్రి న్యూస్’ పేరుతో కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభం కానుందనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తమిళంలో ‘వెట్రి’ అంటే విజయం అని అర్థం. ఇప్పటికే పార్టీ పేరులో ఆ పదాన్ని ఉపయోగించిన విజయ్, ఇప్పుడు ఛానల్‌కు కూడా అదే పేరును ఖరారు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఛానల్ పూర్తిస్థాయి స్వతంత్ర వార్తా వేదికగా పనిచేస్తుందా లేదా పార్టీ అనుబంధ మీడియాగా కొనసాగుతుందా అనేది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!