
జనరల్

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2028 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే అన్ని కొత్త వాహనాల్లో వెహికల్ టు వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసి, 30 రోజుల్లో ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు కోరింది.
వీటూవీ టెక్నాలజీ రేడియో సిగ్నల్స్ ద్వారా సమీపంలోని వాహనాల వేగం, బ్రేకింగ్ వంటి సమాచారాన్ని పరస్పరం పంచుకుంటుంది. ముందు వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేస్తే లేదా రాంగ్ రూట్‌లో వాహనం వస్తే డ్రైవర్‌కు వెంటనే హెచ్చరిక ఇస్తుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేసి ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!