
జనరల్

అమెరికాలో నివసిస్తున్న భారతీయుడు హర్ష్ అమెరికా, భారత్‌లలో ట్రాఫిక్ సమయంలో డ్రైవర్ల ప్రవర్తనను పోల్చుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయిన సమయంలో అమెరికా డ్రైవర్లు ఎలాంటి హారన్‌లు కొట్టకుండా, తొందరపడకుండా ప్రశాంతంగా వేచి ఉన్న దృశ్యాలను వీడియోలో చూపించారు. ఈ వీడియో రోడ్డు క్రమశిక్షణ, పౌర స్పృహపై చర్చకు దారి తీసింది.
వాహనాల మధ్య దూరం పాటించడం, ముందుకు వెళ్లేందుకు అనవసరంగా ప్రయత్నించకపోవడం, ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు ఓపికగా వేచి ఉండటం తనను ఆకట్టుకుందని హర్ష్ తెలిపారు. భారత ట్రాఫిక్‌తో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు అమెరికా డ్రైవర్ల క్రమశిక్షణను ప్రశంసించగా, మరికొందరు రెండు దేశాల రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్ సాంద్రతలో తేడాలు ఉన్నాయని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!