
జనరల్

మెదక్ ఎంపీ రఘునందన్ రావు సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను చీఫ్ జస్టిస్‌తో కలిపి 34 నుంచి 38కు పెంచే సుప్రీంకోర్టు సవరణ బిల్లు 2026 ఆమోదం పొందడాన్ని స్వాగతించారు. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో దాదాపు లక్ష కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఏటా సుమారు 65 వేల కేసులు పరిష్కారమవుతున్నప్పటికీ, కొత్తగా 75 వేల కేసులు నమోదవుతున్నాయని రఘునందన్ రావు చెప్పారు. న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం రూ.7 వేల కోట్లు ఖర్చు చేసిందని, కొలీజియం వ్యవస్థలో మరింత పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు. అలాగే E20 ఇంధనంపై ఉన్న అపోహలను త్వరలోనే నివృత్తి చేస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!