

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్‌ఇండియా ఎయిర్‌బస్ A320 విమానంలో ఆగస్టు 4న తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్‌బస్ ప్రాథమిక విశ్లేషణ ప్రకారం.. సుమారు నాలుగు సెకన్లపాటు విమానంలోని కీలక నియంత్రణ వ్యవస్థలు సరిగా పనిచేయలేదు. మూడు స్వతంత్ర హైడ్రాలిక్ వ్యవస్థలు ఒకేసారి ప్రభావితమవడంతో విమానం సుమారు 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. ఆ సమయంలో విమానంలో 137 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు.
ఈ ఘటనకు అసలు కారణమేంటన్న దానిపై భారత అధికారులు, ఎయిర్‌బస్, ఫ్రాన్స్‌కు చెందిన BEA కలిసి దర్యాప్తు చేస్తున్నారు. హైడ్రాలిక్ వ్యవస్థలు, సెన్సర్లు, స్విచ్‌లు, వైరింగ్ తదితరాలను మరింతగా తనిఖీ చేయాలని ఎయిర్‌బస్ సూచించింది. ఇదిలా ఉండగా, విమాన కెప్టెన్‌కు నిర్వహించిన నిర్ధారణ డ్రగ్ పరీక్షలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించారు. అయితే కెప్టెన్ డ్రగ్ పరీక్ష ఫలితానికి, సాంకేతిక లోపానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!