

వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా భూ సేకరణ చేపట్టినందుకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. ఇప్పటికే ఉన్న 700 ఎకరాలకు తోడు 253 ఎకరాలను త్వరితగతిన సమీకరించి ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించినట్లు తెలిపారు. బౌండరీ వాల్ పనులకు టెండర్లు పిలిచామని, రన్‌వే పనులకు సిద్ధమయ్యామని, ప్రధాన భవనాల నిర్మాణానికి మూడు నుంచి నాలుగు వారాల్లో టెండర్లు ఆహ్వానిస్తామని చెప్పారు. 2028 జూన్ 2 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
కాకతీయ సంస్కృతి ప్రతిబింబించేలా వరంగల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌లో సుమారు 1,500 ఎకరాలతో మరో విమానాశ్రయం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు, ఇది సివిలియన్ మరియు డిఫెన్స్ అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఉడాన్ పథకాన్ని మరో పది సంవత్సరాలు పొడిగించి రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, 2047 నాటికి భారత్‌ను ప్రపంచ ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!