

రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ భారాసకు సూచించారు. మంగళవారం హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సహకార రాజకీయాల ప్రాముఖ్యతను వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నదని ఆయన అన్నారు. ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకు ప్రాజెక్టులో నీటిని నింపుతామని తెలిపారు. మేడిగడ్డ, కన్నెపల్లి అంశాలపై భారాస నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్, హరీశ్ రావు సూచనలు చేయాలని, ఆరోపణల రాజకీయాలు మానాలని అన్నారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కరవును దృష్టిలో పెట్టుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!