

హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే వెనక్కి తీసుకున్నారు. నౌకలకు రక్షణ కల్పించేందుకు సరుకు విలువలో 20% రుసుము విధిస్తామని ప్రకటించిన ఆయన, ఇప్పుడు దానికి బదులుగా పశ్చిమాసియా దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడులు పెడతాయని తెలిపారు. పశ్చిమాసియా నాయకులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు కొనసాగిస్తూ తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి మరియు డ్రోన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లపై దాడులకు దిగింది. జోర్డాన్ సైన్యం నాలుగు క్షిపణులను అడ్డుకున్నట్లు తెలిపింది. ప్రాంతంలో యుద్ధ వాతావరణం మళ్లీ తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!