

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల నాణ్యతపై అధికారులు దృష్టి సారించారు. రోగులకు సరైన చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో 135 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైద్యుల పనితీరు, రోగులకు అందుతున్న సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు జూలై నుంచి నవంబర్ వరకు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా రోగుల నుంచి అభిప్రాయాలను సేకరించి వైద్య సేవల నాణ్యతను అంచనా వేశారు.
సర్వే ఫలితాల్లో 81.6 శాతం సంతృప్తి స్కోరుతో పల్నాడు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 81.5 శాతంతో పోలవరం రెండో స్థానంలో, 80.7 శాతంతో నెల్లూరు మూడో స్థానంలో ఉన్నాయి. 69.5 శాతం స్కోరుతో కర్నూలు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ ఫలితాల ఆధారంగా వైద్యుల పనితీరుపై అధికారులు సమీక్ష చేపట్టి, వివరణ కోరుతూ సంబంధిత వైద్యులకు నోటీసులు జారీ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!