
రాజకీయాలు

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు నూతన ఎయిడ్-డి-క్యాంప్ (ఏడీసీ)గా వాయుసేనకు చెందిన స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్ నియమితులయ్యారు. ఆయన శుక్రవారం లోక్‌భవన్‌లో తన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. ఇప్పటివరకు ఏడీసీ గా విధులు నిర్వహించిన ఆర్మీకి చెందిన మేజర్ అమన్ కుందు స్థానంలో హరీష్ చందర్ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నూతన ఏడీసీ హరీష్ చందర్‌కు ఏడీసీ చిహ్నాన్ని అలంకరించి, శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!