
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియాతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సత్యసాయి జిల్లాలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు కియా సంస్థ అంగీకరించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ.18 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 465 ఎకరాల విస్తీర్ణంలో రెండో ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది.
ఈ ప్లాంట్ నిర్మాణాన్ని 2029 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కియా ప్రతినిధులను కోరారు. 2030 నాటికి కొత్త ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఈ విస్తరణతో రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత ఊపందుకోవడంతో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!