

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ మేరకు ఏపీ టూరిజం అథారిటీ (APTA), ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ సంస్థ ఎక్స్‌ప్లర్జర్ రూపొందించిన 'నివు ఏఐ' (NiVU AI) ప్లాట్‌ఫారమ్ వినియోగానికి మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయం అందుబాటులోకి రానుంది. తొలి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభమై, మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయని, ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ అవసరం లేదని మంత్రి తెలిపారు. అలాగే పర్యాటకుల అభిరుచులు, భాషలు, ప్రయాణ ధోరణులపై రియల్‌టైమ్ విశ్లేషణల ద్వారా భవిష్యత్ పర్యాటక ప్రణాళికలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!