
జనరల్

టీమిండియా టీ20 జట్టుకు సంబంధించిన మార్పుల నేపథ్యంలో తాను జట్టు మేనేజ్‌మెంట్‌ను విమర్శించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకటన పూర్తిగా నకిలీదని స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన ఆయన, తన పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
భారత క్రికెట్‌కు, సహచర ఆటగాళ్లకు తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని సూర్యకుమార్ తెలిపారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి అవకాశాన్ని ఆస్వాదించి దేశానికి పేరు తీసుకురావాలని సూచించారు. భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, తాను ఎల్లప్పుడూ టీమిండియాతోనే ఉంటానని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!