
జనరల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు హిమాన్ష్ సోమవారం స్పోర్ట్స్ ఆడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

హిమాన్ష్ గాయపడిన విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని మనుమడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. హిమాన్ష్ త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!