

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అందిన చిత్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న సందడిని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చూపుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తున్నాయి.
కాకినాడ, నెల్లూరు, ఎన్టీఆర్, పోలవరం, కృష్ణా, వైఎస్సార్ కడప, విజయనగరం, అల్లూరి, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల వర్షం, పోలింగ్ కేంద్రాల వద్ద నీరు నిలవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు ఓటు వేసేందుకు కేంద్రాలకు వస్తున్నారు. మరోవైపు అధికారులు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న ఈ దృశ్యాలు పరిషత్ ఎన్నికల పోలింగ్ వాతావరణాన్ని తెలియజేస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!