

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ బ్యాంకులు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆదాయపు పన్ను శాఖ, ఇండియన్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సహా పలు సంస్థలు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంబీఏ, ఇంజినీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా క్రీడాకారులు, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇవి మంచి అవకాశాలుగా నిలుస్తున్నాయి.
ఆదాయపు పన్ను శాఖ దిల్లీ రీజియన్‌లో స్పోర్ట్స్ కోటా కింద మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ విభాగాల్లో మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. ఇండియన్ బ్యాంక్‌లో 1,500 అప్రెంటిస్ ఖాళీలు ఉండగా, వీటిలో తెలంగాణకు 48, ఆంధ్రప్రదేశ్‌కు 85 పోస్టులు కేటాయించారు. మరోవైపు, పవర్ గ్రిడ్‌లో 319 ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 50 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత సంస్థల అధికారిక వెబ్‌సైట్లలో నోటిఫికేషన్లు పరిశీలించి, గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!