6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన..

Writer: Chandrika 09:42 AM, 6 నవంబర్, 2026
విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన..

విజయవాడ వద్ద కృష్ణా నదిపై మరో కొత్త రైల్వే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. విజయవాడ జంక్షన్‌-కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ స్టేషన్ల మధ్య, విజయవాడ-సీతానగరం ప్రాంతంలో ఈ వంతెన నిర్మించనున్నారు. బల్లార్ష-ఖాజీపేట-విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో విజయవాడ నుంచి గూడూరు వరకు 293 కి.మీ. మేర నాలుగో లైన్‌ నిర్మాణానికి రూ.5,858 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించి రైల్వే బోర్డుకు పంపించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై సుమారు 1.30 కి.మీ. పొడవున మరో వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం విజయవాడ-సీతానగరం మధ్య కృష్ణా నదిపై రెండు రైల్వే వంతెనలు ఉన్నాయి. వీటిలో ఒకదానిపై డబుల్‌ లైన్‌, మరోదానిపై సింగిల్‌ లైన్‌ కొనసాగుతున్నాయి. వీటికి సమీపంలోనే మూడో వంతెన నిర్మించనున్నారు.

కొత్త వంతెన అందుబాటులోకి వస్తే తెనాలి, గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లు కృష్ణా కెనాల్‌ స్టేషన్‌ వద్ద వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి విజయవాడ మీదుగా తమిళనాడు వైపు వెళ్లే గూడ్స్‌ రైళ్ల రాకపోకలు కూడా వేగవంతమవుతాయి. ఇదిలా ఉండగా, కృష్ణా నదిపై మరో రెండు రైల్వే వంతెనల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త రైల్వే లైన్‌లో భాగంగా అమరావతి సమీపంలో ఒక వంతెన నిర్మించనున్నారు. ఇందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. మరోవైపు విజయవాడ బైపాస్‌ రైల్వే లైన్‌లో భాగంగా గుడివాడ-విజయవాడ మార్గంలోని ఇందుపల్లి నుంచి విజయవాడ-తెనాలి మార్గంలోని దుగ్గిరాల వరకు 36.8 కి.మీ. మేర కొత్త డబుల్‌ లైన్‌ నిర్మించనున్నారు. దీనివల్ల విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే గూడ్స్‌ రైళ్లు విజయవాడ స్టేషన్‌లోకి ప్రవేశించకుండానే ప్రయాణించవచ్చు. ఈ బైపాస్‌ లైన్‌, చోడవరం సమీపంలోని కృష్ణా నది వంతెన నిర్మాణానికి కలిపి రూ.3,197 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు పంపించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యార్థులతో ముఖాముఖి

అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యార్థులతో ముఖాముఖి

దీపావళి కానుకగా మెట్రో-ఆర్టీసీ పాస్ ధరలు తగ్గింపు

దీపావళి కానుకగా మెట్రో-ఆర్టీసీ పాస్ ధరలు తగ్గింపు

కోనసీమను కకావికలం చేసిన 1996 తుపానుకు 30 ఏళ్లు..

కోనసీమను కకావికలం చేసిన 1996 తుపానుకు 30 ఏళ్లు..

యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల

శ్రీవారి దర్శనానికి టీటీడీ కొత్త షెడ్యూల్‌

శ్రీవారి దర్శనానికి టీటీడీ కొత్త షెడ్యూల్‌

కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ భేటీకి కేబినెట్‌ సిద్ధం

కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ భేటీకి కేబినెట్‌ సిద్ధం

ట్యాగ్లు
విజయవాడ రైల్వే వంతెనకృష్ణా నదిభారతీయ రైల్వేలురైల్వే అభివృద్ధినాలుగో రైల్వే లైన్విజయవాడ జంక్షన్అమరావతి రైల్వే లైన్రైల్వే బైపాస్ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిగూడ్స్ రైళ్లుగూడూరు రైల్వే లైన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యార్థులతో ముఖాముఖి
జనరల్

అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యార్థులతో ముఖాముఖి

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన..
జనరల్

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన..

దీపావళి కానుకగా మెట్రో-ఆర్టీసీ పాస్ ధరలు తగ్గింపు
జనరల్

దీపావళి కానుకగా మెట్రో-ఆర్టీసీ పాస్ ధరలు తగ్గింపు

ఆస్ట్రేలియా జట్టుకు కీలక బాధ్యతల్లో మైక్ హస్సీ
క్రీడలు

ఆస్ట్రేలియా జట్టుకు కీలక బాధ్యతల్లో మైక్ హస్సీ

కోనసీమను కకావికలం చేసిన 1996 తుపానుకు 30 ఏళ్లు..
జనరల్

కోనసీమను కకావికలం చేసిన 1996 తుపానుకు 30 ఏళ్లు..

జైలర్ 2 విజయం తర్వాత మరో తమిళ సినిమాపై నాగవంశీ కన్ను?
సినిమాలు

జైలర్ 2 విజయం తర్వాత మరో తమిళ సినిమాపై నాగవంశీ కన్ను?

విమర్శల నుంచి ప్రశంసలు.. యష్ కంబ్యాక్ అదుర్స్!
సినిమాలు

విమర్శల నుంచి ప్రశంసలు.. యష్ కంబ్యాక్ అదుర్స్!

మధ్యంతర ఎన్నికల ర్యాలీ తర్వాత అమెరికా మార్కెట్లకు భారీ షాక్..
బిజినెస్

మధ్యంతర ఎన్నికల ర్యాలీ తర్వాత అమెరికా మార్కెట్లకు భారీ షాక్..

రాజమౌళికి పోటీగా నితేష్ తివారీ విజన్?
సినిమాలు

రాజమౌళికి పోటీగా నితేష్ తివారీ విజన్?

ఆదిపురుష్ రికార్డుకి ఆమడ దూరంలో నిలిచిన రామాయణ?
సినిమాలు

ఆదిపురుష్ రికార్డుకి ఆమడ దూరంలో నిలిచిన రామాయణ?

వారణాసి ఓటీటీ హక్కులపై రాజమౌళి కొత్త ప్రయోగం?
ఓటీటీ

వారణాసి ఓటీటీ హక్కులపై రాజమౌళి కొత్త ప్రయోగం?

రామ్ సినిమా విడుదలకు తప్పని వాయిదా?
గాసిప్స్

రామ్ సినిమా విడుదలకు తప్పని వాయిదా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!