
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులకు దరఖాస్తుల గడువును ఎక్సైజ్ శాఖ పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం గురువారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉండగా.. తాజాగా అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించింది. అక్టోబర్ 7న దరఖాస్తులను పరిశీలించనుండగా.. అక్టోబర్ 8న లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేయనున్నారు.
రాష్ట్రంలో 807 మద్యం షాపుల కేటాయింపునకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతోనే గడువును పొడిగించినట్లు సమాచారం. లైసెన్సీల ఎంపిక, తుది కేటాయింపును నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎక్సైజ్ శాఖ చేపట్టనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!