
జనరల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ అధికారులు జీవో జారీ చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాలుగు దశల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇందులో గ్రూప్–1 కింద 149 పోస్టులు, గ్రూప్–2 కింద 673 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోలీసు, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, అటవీ, పశుసంవర్థక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు. నాలుగు దశల్లో నోటిఫికేషన్లు విడుదల చేయడం ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పలు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!