
రాజకీయాలు

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. పెట్రోలియం, సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, పర్యాటకం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. అనంతరం పలు కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
సమావేశంలో 50కి పైగా భారీ ప్రాజెక్టులకు అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పడి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇవి కీలకంగా మారనున్నాయి. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పనుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!