
షోస్

ఆంధ్రప్రదేశ్‌లోని విజయ డెయిరీ బోర్డు ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విజయ డెయిరీ చైర్మన్‌గా దాసరి బాలవర్ధన్ రావు ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఆయనతో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నిక కూడా చెల్లదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయ డెయిరీ పాలకవర్గంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.
బోర్డు డైరెక్టర్ల ఎన్నికల ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చైర్మన్‌తో పాటు మరో నలుగురు డైరెక్టర్ల ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో విజయ డెయిరీ బోర్డు వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!