

ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (DST) ఆధ్వర్యంలో అమలవుతున్న INSPIRE-SHE 2026 స్కాలర్షిప్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సైన్స్, పరిశోధనా రంగాల్లో డిగ్రీ, పీజీ విద్యను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.60,000 చొప్పున మొత్తం 12,000 స్కాలర్షిప్లు అందించనున్నారు. అర్హులైన విద్యార్థులు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 7, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ రాత్రి 11:59 గంటల వరకు అవకాశం ఉంది.
17 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, 2025లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ వంటి సైన్స్ సబ్జెక్టులతో పాటు B.Sc, BS, నాలుగేళ్ల B.Sc with Research, Integrated M.Sc, MS కోర్సుల్లో చేరినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతిలో టాప్ 1 శాతం మార్కులు సాధించినవారు, JEE Main, JEE Advanced లేదా NEETలో టాప్ 10,000 ర్యాంకులు పొందిన అర్హులు, NTSE, JBNSTS స్కాలర్లు, అంతర్జాతీయ ఒలింపియాడ్ పతక విజేతలకు కూడా అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60,000 అందిస్తారు. మూడో, నాలుగో సంవత్సరాల్లో పరిశోధనా ప్రాజెక్టుల కోసం నిబంధనల ప్రకారం అదనంగా రూ.20,000 మెంటార్షిప్ గ్రాంట్ పొందే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!