
రాజకీయాలు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిజాయితీ, చిత్తశుద్ధి, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న అంకితభావం తనను ఎప్పుడూ ఆకట్టుకుందని పేర్కొన్నారు. సవాళ్లు ఎదురైనా తన నమ్మకాల కోసం రాహుల్ గాంధీ నిలబడే నాయకుడని ఆమె కొనియాడారు.
దేశం కోసం విశేష త్యాగాలు చేసిన కుటుంబ వారసత్వాన్ని రాహుల్ గాంధీ వినయంతో, అంకితభావంతో ముందుకు తీసుకెళ్తున్నారని షర్మిల అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భారత దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగల నాయకుడిగా రాహుల్ గాంధీని భావించేవారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీకి ఆయురారోగ్యాలు, ఆనందం, శక్తి, ప్రజాసేవలో మరింత విజయాలు కలగాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!