
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్రిపుల్‌ఐటీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలను డిసెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ సబ్జెక్టుకు పరీక్ష ఉంటుందనే వివరాలను షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
స్క్రీనింగ్ పరీక్షలు పూర్తైన తర్వాత అభ్యర్థుల ఫలితాలను ఏపీపీఎస్సీ సంబంధిత యూనివర్సిటీలకు అందజేయనుంది. స్క్రీనింగ్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా యూనివర్సిటీలు తదుపరి దశకు అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. అభ్యర్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష తేదీని పరిశీలించి, అందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!