
సినిమాలు

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేశారు. పదవీ విరమణకు ముందు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించిన ఆయన, అమర వీరులకు పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల సైనిక సేవను గుర్తుచేసుకున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక్ స్కూల్ విద్యార్థిగా ప్రారంభమైన తన ప్రయాణం భారత ఆర్మీ అత్యున్నత కమాండర్ స్థాయికి చేరుకోవడం జీవితంలో గొప్ప గౌరవమని అన్నారు. సైనికుల త్యాగం, వారి కుటుంబాల సహనం, దేశ ప్రజల విశ్వాసమే భారత సైన్యానికి అసలైన బలమని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!