14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

Writer: Harika S 10:16 PM, 14 ఆగస్టు, 2026
మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

విడుదల తేదీ: ఆగస్టు 14, 2026
నటీనటులు: విశాల్, దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, జయప్రకాష్ తదితరులు
దర్శకుడు: విశాల్
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాత: ఆర్.బి. చౌదరి
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటింగ్: ఎన్.బి. శ్రీకాంత్

కథ:
కృప (విశాల్) జమున (దుషారా విజయన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. భార్య, ఇద్దరు పిల్లలతో సాధారణ జీవితాన్ని గడుపుతూ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుంటాడు. చాలీచాలని జీతంతో జీవనం సాగించే కృప.. తన మామగారికి చెప్పిన అబద్ధం కారణంగా బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేస్తాడు. అనంతరం కుటుంబంతో కలిసి ఆ కారులో ఊటీకి వెళ్లగా అక్కడ దాడి జరుగుతుంది. ఈ ఘటనలో అతని భార్య, కుమార్తె చనిపోతారు.

నెలకు రూ.25 వేల జీతం వచ్చే ఓ సాధారణ ఉద్యోగిపై ఎందుకు దాడి జరిగింది? అసలు ఆ దాడికి కారణం ఏమిటి? లింగా (విశాల్), అన్నపూర్ణ (అంజలి) ఎవరు? వారికి కృపకు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్లు:
విశాల్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తన పాత్రలో విభిన్న వేరియేషన్స్ చూపిస్తూ ఆకట్టుకున్నారు. దుషారా విజయన్ తన పాత్రలో ఒదిగిపోయి, కీలక సన్నివేశాల్లో మంచి నటన కనబరిచారు. అంజలి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆమె పాత్రలోని డెప్త్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. తంబి రామయ్య, జయప్రకాష్‌తో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు.

మైనస్ పాయింట్లు:
సినిమా ట్రీట్‌మెంట్ కొంత రొటీన్‌గా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథనాన్ని మరింత ఆసక్తికరంగా, కాస్త షార్ప్‌గా నడిపించి ఉంటే బాగుండేది. విశాల్, విలన్ల మధ్య కాన్‌ఫ్లిక్ట్ కూడా ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేదు.

సాంకేతిక విభాగం:
రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా చక్కగా చిత్రీకరించారు. కొన్ని చోట్ల ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. జి.వి. ప్రకాష్ కుమార్ పాటలు పర్వాలేదనిపించగా, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రచయితగా, దర్శకుడిగా విశాల్ కొన్ని చోట్ల మెప్పించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:
మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన మకుటంలో బలమైన ఎమోషన్, మంచి నటన ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. నెమ్మదిగా సాగే కథనం, సెకండాఫ్‌లో అక్కడక్కడా కనిపించే సాగతీత సినిమాపై ప్రభావం చూపాయి. అయితే విశాల్, దుషారా విజయన్, అంజలి నటన ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా మకుటం ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది.

రేటింగ్: 2/5

రేటింగ్:

2/5

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ

అగధ మూవీ రివ్యూ

అగధ మూవీ రివ్యూ

కేజెక్యూ మూవీ రివ్యూ

కేజెక్యూ మూవీ రివ్యూ

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?

కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ: వరుణ్ తేజ్ హిట్ కొట్టేశాడా?

కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ: వరుణ్ తేజ్ హిట్ కొట్టేశాడా?

'ధంధా' రివ్యూ: 64 నిమిషాల్లో మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్..

'ధంధా' రివ్యూ: 64 నిమిషాల్లో మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్..

ట్యాగ్లు
మకుటంవిశాల్దుషారా విజయన్అంజలిజి.వి. ప్రకాష్ కుమార్సినిమా రివ్యూ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ
జనరల్

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ

సోషల్ మీడియా విషయంలో జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
జనరల్

సోషల్ మీడియా విషయంలో జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూలు

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

యాదగిరిగుట్టలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు
జనరల్

యాదగిరిగుట్టలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
జనరల్

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్
జనరల్

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు
క్రీడలు

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు
జనరల్

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే
జనరల్

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం
జనరల్

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....
ఓటీటీ

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!