14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Writer: Harika S 08:56 PM, 14 ఆగస్టు, 2026
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అర్హులైన విద్యార్థులు ప్రత్యేకంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అడగాల్సిన అవసరం లేకుండా, ప్రతి ఏటా నిధులను ముందుగానే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఈ విధానాన్ని ప్రక్షాళన చేసి ఏటా రూ.2,400 కోట్లను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తూ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

నెక్లెస్‌ రోడ్ సమీపంలోని హెచ్ఎండీఏ మైదానంలో జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో సీఎం ఈ విషయాలను వెల్లడించారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యాసంస్థలు నిలిపివేయరాదని స్పష్టం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్, నర్సింగ్, పాలిటెక్నిక్, ఏఐ వంటి రంగాల్లో నైపుణ్యాలు సాధించాలని అన్నారు. అలాగే క్రీడల్లో ప్రతిభ చూపే వారికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. పూలే దంపతుల స్ఫూర్తితో విద్యలో రాణించడంతో పాటు సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధికి విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంఫీజు రీయింబర్స్‌మెంట్రేవంత్ రెడ్డితెలంగాణ విద్యార్థులువిద్యా వార్తలునైపుణ్యాభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
జనరల్

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్
జనరల్

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు
క్రీడలు

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు
జనరల్

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే
జనరల్

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం
జనరల్

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....
ఓటీటీ

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ
సినిమాలు

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్
సినిమాలు

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్
సినిమాలు

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!