

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ట్రస్ట్ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 26 అంశాలకు ఆమోదం తెలిపింది. కొండపై దీక్షాపరుల, నిత్యకల్యాణ మండపాలు, మెట్ల మార్గంలో షెడ్లు, వేద పాఠశాల, గోశాల ఏర్పాటు చేయడంతో పాటు రాయగిరి వద్ద భారీ కమాన్ నిర్మించాలని నిర్ణయించింది. రోజూ 2 వేల మంది భక్తులకు అన్నదానం అందించేందుకు కూడా ఆమోదం తెలిపింది.
ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యాలకు టీసీఎస్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ సౌకర్యం కల్పించేందుకు బోర్డు అంగీకరించింది. భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొండ చుట్టూ ప్రధాన కూడళ్ల వద్ద రాతి విగ్రహాలు ఏర్పాటు చేయడం, తులసి కాటేజీలో రెండు కల్యాణ కట్టలు నిర్మించడం, దాతల కోసం కొండపై ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడం, గిరిప్రదక్షిణ మార్గంలో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!