
రాజకీయాలు

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అమలుపై పునఃసమీక్ష చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వాహనదారులకు సాధారణ పెట్రోల్ లేదా ఈ20 పెట్రోల్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. వాహనాల అనుకూలత, వినియోగ అవసరాల ఆధారంగా ఇంధనాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వినియోగదారులకు ఉండాలని సూచించారు.
అలాగే ఈ20 పెట్రోల్ ధరను తగ్గించాలని కేజ్రీవాల్ కోరారు. ఈ20 పెట్రోల్ వినియోగం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతుందని లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఇంధనాన్ని విస్తృతంగా అమలు చేసే ముందు వినియోగదారుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!