

నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ జూలై 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఛలో సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సు’ ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నేతృత్వంలో పలువురు పార్టీ నాయకులు సరూర్‌నగర్ స్టేడియాన్ని సందర్శించారు.
2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యువ సంగ్రామ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్‌వీ నాయకులు, పార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!