

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ వరంగల్, ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, వాటిని 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
దేశ జనాభాలో తెలంగాణ వాటా సుమారు 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీలో రాష్ట్రం 5 శాతం వాటా కలిగి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలున్న విమానాశ్రయాలు అవసరమని ఆయన అన్నారు. వరంగల్ విమానాశ్రయం రూపకల్పనలో కాకతీయ సంస్కృతి ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభివృద్ధి లక్ష్యంగా సహకార స్ఫూర్తి కొనసాగుతుందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులతో అభివృద్ధి అంశాలపై నిరంతరం చర్చలు కొనసాగిస్తామని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!