

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, రిజర్వాయర్లలో నీటి లభ్యత వంటి అంశాలను నిరంతరం సమీక్షిస్తూ తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి వచ్చే వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పశుగ్రాస కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. రవాణా శాఖలో అవసరంలేని నిబంధనలను తొలగిస్తూ సాంకేతికత వినియోగాన్ని పెంచాలని సూచించారు. గోదావరి వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉన్నామని అధికారులు సీఎంకు వివరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!