
రాజకీయాలు

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కెమెరాగా గుర్తింపు పొందిన 3,200 మెగాపిక్సెల్ ఎల్‌ఎస్‌ఎస్‌టీ కెమెరా అంతరిక్ష అద్భుత దృశ్యాలను బంధించింది. ఒకే ఫ్రేమ్‌లో సుమారు 5 లక్షల నక్షత్ర మండలాలు, 50 వేల నక్షత్రాలను చిత్రీకరించింది. చిలీలోని వెరా సీ రుబిన్ అబ్జర్వేటరీ ఈ అరుదైన చిత్రాన్ని విడుదల చేసింది.
8.4 మీటర్ల సిమోన్యి సర్వే టెలిస్కోప్‌కు అమర్చిన ఈ కెమెరా తీసిన చిత్రంలో స్పైరల్ ఆకారంలోని నక్షత్ర మండలాలు, దీర్ఘవృత్తాకార గెలాక్సీలు, పరస్పరం ఢీకొంటున్న నక్షత్ర సమూహాలు, మసకగా కనిపించే అరుణ వర్ణపు గెలాక్సీలు స్పష్టంగా కనిపించాయి. ఈ చిత్రం ఖగోళ పరిశోధనలో కొత్త అవకాశాలకు మార్గం చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!