

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉడాన్ 2.0 పథకం అమలు తీరుపై నిర్వహించిన వర్క్‌షాప్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, విమానాశ్రయం నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవ తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఇటీవల కేంద్ర హోంశాఖ భోగాపురం విమానాశ్రయాన్ని 'ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025' పరిధిలోకి తీసుకువస్తూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భోగాపురం దేశంలోని 39వ కేటగిరీ-1 విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. అలాగే ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్ హోదా లభించడంతో ఈ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు మార్గం సుగమమై, ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!