

ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రాజమహేంద్రవరానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వైష్ణవి చోడిశెట్టిని ఆయన వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైంది.
యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో భారీ క్రేజ్ సంపాదించిన షణ్ముఖ్, బిగ్‌బాస్ తెలుగు సీజన్-5 రన్నరప్‌గా మరింత గుర్తింపు పొందారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి కెరీర్‌పై దృష్టి సారించిన ఆయన ఇప్పుడు వైష్ణవితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, తోటి యూట్యూబర్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!