
గాసిప్స్

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని పలు శివారు కాలనీలు వర్షాలు తగ్గి మూడు రోజులు గడిచినా ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రోజుల పాటు 15 నుంచి 20 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైంది. దీంతో పట్టణంలోని సగానికి పైగా రహదారులు నీటమునిగాయి. పలు నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేక రహదారులపైనే నిలిచిపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీల్లో నీరు పేరుకుపోవడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీరు పూర్తిగా తగ్గేందుకు మరో రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!