

దేశంలోనే తొలి రోప్‌వే ఆధారిత పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ వారణాసిలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర నగరాన్ని సందర్శించే యాత్రికులు, పర్యాటకులకు ప్రయాణాన్ని సులభతరం చేసే లక్ష్యంతో ఈ రవాణా మార్గాన్ని నిర్మిస్తున్నారు. వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి గోదౌలియా వరకు సుమారు 3.75 కిలోమీటర్ల మేర ఈ రోప్‌వే ఏర్పాటు చేశారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తికాగా.. ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో సేవలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే కంటోన్మెంట్ నుంచి గోదౌలియాకు చేరుకునేందుకు పట్టే సమయం సుమారు 45 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గనుంది. ముఖ్యంగా కాశీ విశ్వనాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణ మార్గంగా మారనుంది. నగరంలోని రహదారులపై రద్దీని తగ్గించడంతో పాటు, ప్రధాన ప్రాంతాలకు వేగంగా చేరుకునేందుకు ఈ రవాణా వ్యవస్థ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!