
జనరల్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు బెంగళూరులోని ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఇస్రో అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, బాంబు స్క్వాడ్‌తో అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
పూర్తి స్థాయి తనిఖీల తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది నకిలీ బెదిరింపుగా పోలీసులు నిర్ధరించారు. ఈ-మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఢిల్లీ పోలీసులు ఘాజియాబాద్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి, అతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తదితర సంస్థలకు నకిలీ బెదిరింపు మెయిల్స్ పంపినట్లు వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!